ఒకరి ఫోన్ లను మరొకరు చెక్ చేయడం.. రిలేషన్‌కు ఎంతవరకు మేలు చేస్తుంది..!
Publish Date:Nov 29, 2025
Advertisement
పెళ్లైపోయింది.. భార్యాభర్తలు అయిపోయాం.. ఇక నీకు నాకు మధ్య దాపరికం ఏముంటుంది? ఫోన్ చూస్తే తప్పేంటి? ఇది చాలా మంది బార్యలు లేదా భర్తలు చెప్పే మాట. ఇందులో నిజమే ఉన్నా.. పోన్ లో ఏదో దాపరికం లేదా రహస్యం ఉంటుంది కాబట్టే ఫోన్ చూడద్దు అని అంటున్నారు అనుకోవడం చాలా పొరపాటు. ఫోన్.. వ్యక్తిగతం.. చాలమంది ఫోన్ లో పర్సనల్ ఉంటుంది అనుకుంటారు. ఇది చాలా వరకు అందరూ కరెక్ట్ అనుకుంటారు. నిజానికి వ్యక్తిగతం అనేది జీవితానికి సంబంధించిన విషయం. కానీ ఫోన్ లో ఉండేది కేవలం సోషల్ మీడియా జీవితం. స్నేహితులతో చాటింగ్ చేసినా, ఆఫీసు వ్యక్తులతో కాంటాక్ట్ అవుతున్నా, ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నా, ఫోన్ లు మాట్లాడుతున్నా అవన్నీ ఔటాఫ్ రిలేషన్ విషయాలు. పదే పదే ఫోన్ చూడటం, విషయాల గురించి గుచ్చి గుచ్చి అడగటం, బయటి వ్యక్తుల గురించి ఎక్కువ మాట్లాడటం వంటివి బంధాన్ని దెబ్బతీస్తాయి. ఇలా మాట్లాడటం వల్ల బంధంలో నమ్మకం బలహీనం అవుతుంది. తప్పేం కాదు... కానీ.. నమ్మకం.. అనుమానం.. పదే పదే విసిగిస్తుంటే దాన్నివేదింపుగా అనుకుంటారు. ఇదే నెమ్మదిగా అనుమానం అనే జబ్బుగా మారుతుంది. కానీ భార్యాభర్తలు ఇద్దరూ ఏ విషయాన్ని అయినా ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటే అసలు అనుమానం అనే మాటే ఇద్దరి మధ్య ఉండదు. నువ్వు తప్పక చూపించాల్సిందే లాంటి డిమాండ్లు లేకుండా వారి పోన్ లు చూపించమని అడగడానికి ముందు మీరే వారికి మీ పోన్ చూపిస్తూ ఉంటే వారిలో క్రమంగా మార్పు వస్తుంది. అప్పుడే నమ్మకం బలపడుతుంది. ఇగో నే.. గోల.. చాలామంది ఇలా పోన్ చూడటం అనే విషయాన్ని క్యారెక్టర్ ను అవమానించడం, అహం దెబ్బతినడం అని చెబుతూ ఉంటారు. నిజానికి నేటి జెనరేషన్ లో ఇగో వల్లనే బంధాలు దెబ్బతింటాయి. అయితే ఇగోను పదే పదే రెచ్చగొట్టడం కూడా మంచిది కాదు. పెళ్లైన కొత్తలో మాత్రం ఇలాంటి విషయాలలో ఎంత లైట్ గా ఉంటే అంత మంచిది. ఒకప్పుడు.. భార్యాభర్తల మధ్య దాపరికం ఏముంటుంది? మేమేమన్నా అలాగే చేస్తున్నామా అని వెనుకటి తరం వాళ్లు చెబుతుంటారు. కానీ స్మార్ట్ ఫోన్ లు అందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ తరం వేరు.. బంధం ముడిపడ్డాక ఆ బంధం బలపడాలంటే అన్ని విషయాలు గీసి రెచ్చగొట్టుకోవడం ఆపాలి. అందుకే ఈ జెనరేష్ వాళ్లు బంధం బాగుండటానికి ఇతర విషయాలను పట్టించుకోవడం మానేయాలి. ఆధారపడటం.. భార్య భర్త మీద, భర్త భార్య మీద ఆధారపడటం అనేది బంధాన్ని నిలబెట్టే విషయం. భార్య ఇంటిపని, వంట పని చేసి భర్తకు అన్ని సమకూర్చడంలో అతను భార్య మీద ఎలా ఆదారపడతాడో.. తనకు కావలసిన వస్తువైనా, వేరే ఏదైనా భర్త ను అడగడం పట్ల భార్య అలాగే ఉండాలి. డబ్బు.. బార్యాభర్తల మధ్య డబ్బు కూడా చాలా పెద్ద గొడవలు సృష్టిస్తుంది. భార్య తనది కాబట్టి ఆమె కష్టార్జితం తనదే అనుకునే భర్తలు ఉంటారు. తాను సంపాదిస్తున్నాను కాబట్టి భర్త జోక్యం చేసుకోకూడదు అనుకునే భార్యలు కూడా ఉంటారు. కానీ బార్య సంపాదించినా అవసరం, సందర్భం వస్తే ఆమె ఎప్పుడైనా ఇచ్చేది భర్తకే.. అలాగే భర్త కూడా ఎప్పుడూ తను సంపాదించే డబ్బుతోనే భార్యను చూసుకోవాలని, బార్య సంపాదన పర్మినెంట్ అనే ఆలోచన చేయడం మానుకోవాలి. పైనల్ గా.. భార్యాభర్తలు ఒకరి పోన్ ఒకరు చూడటం తప్పు కాదు.. అలాగని పోన్ చూడకపోవడం, చూడనివ్వకపోవడం అంటే అందులో ఏదో రహస్యం ఉంటుందని కాదు.. అర్థం చేసుకోవడం, ప్రాముఖ్యత ఇవ్వడంలోనే అంతా ఉంటుంది. కానీ ఎప్పుడూ అనుమానాన్ని ప్రోత్సహించకూడదు. *రూపశ్రీ.
ఏ సంబంధానికైనా నమ్మకం పునాది. కానీ నేటి డిజిటల్ యుగంలో ఈ నమ్మకం కొన్ని విషయాల చుట్టూనే తిరుగుతుంది. వాటిలో ఫోన్ చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయడంలో తప్పేముందని చాలా మంది అంటుంటారు. నిజానికి ఇలా పోన్ చెక్ చేయడం అనే విషయం కారణంగా గొడవలు పెరిగి భార్యాభర్తల మద్య నమ్మకం కోల్పోయి, విడిపోవడానికి దారి తీస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఫోన్ చూడటంలో ఏముంది? ఇదేం పెద్ద విషయం కాదే.. అన్నట్టు అనిపిస్తుంది చాలామందికి. కానీ ఇది బయటకు వివరించలేని సమస్యలను క్రియేట్ చేస్తుంది. అసలు భార్యాభర్తలు ఒకరి ఫోన్ ను మరొకరు చెక్ చేయడం అనే విషయం బంధాన్ని ఎంత దెబ్బతీస్తుందో దీని వల్ల కలుగుతున్న నష్టాలేంటో తెలుసుకుంటే..
భార్యాభర్తలు ఒకరి ఫోన్ ను మరొకరు చూడటం తప్పేమీ కాదు..కానీ ఒకరిని మరొకరు అనుమానించినట్టు, అవమానించినట్టు బిహేవ్ చేయడం మాత్రం చాలా తప్పు. చాలామంది మగాళ్లు పెళ్లయ్యాక భార్య గురించి ప్రతిదీ తనకు తెలియాలని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ప్రతి వ్యక్తికి కొన్ని మినహాయింపులు ఉండాలి.
http://www.teluguone.com/news/content/if-you-exchange-phone-with-your-partner- is-it-healthy-for-your-relationship-35-210209.html





